సయాటిక నొప్పి (Sciatica): కారణాలు, లక్షణాలు మరియు ఫిజియోథెరపీ చికిత్స

సయాటిక్ (Sciatic) నరం మన శరీరంలో అతి పెద్ద నరం — వెన్నుపూస నుండి మొదలై పిరుదుల గుండా, తొడ వెనక భాగం వెంట, పాదం వరకు వ్యాపిస్తుంది. ఈ నరానికి ఒత్తిడి లేదా చికాకు కలిగినప్పుడు అనుభవించే నొప్పినే సయాటిక అంటారు.

సయాటిక నొప్పి కారణాలు (Causes of Sciatica in Telugu)

1. డిస్క్ హెర్నియేషన్ (Disc Herniation): వెన్నుపూస మధ్య ఉండే డిస్క్ జారిపోయి సయాటిక్ నర మూలంపై ఒత్తిడి పెడుతుంది. ఇది అత్యంత సాధారణ కారణం.

2. స్పైనల్ స్టెనోసిస్ (Spinal Stenosis): వెన్నుపూస కాలువ ఇరుకై నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది. వృద్ధులలో ఎక్కువగా వస్తుంది.

3. పిరిఫార్మిస్ సిండ్రోమ్ (Piriformis Syndrome): పిరుదులలో ఉండే పిరిఫార్మిస్ కండరం సయాటిక్ నరాన్ని నొక్కుతుంది.

4. స్పాండిలోలిస్తెసిస్ (Spondylolisthesis): ఒక వెన్నుపూస మరొకదాని మీద జారిపోవడం.

సయాటిక లక్షణాలు (Sciatica Symptoms in Telugu)

  • వెన్ను నుండి కాలు వరకు వ్యాపించే మంట లేదా కరెంట్ షాక్ లాంటి నొప్పి
  • కాలు, తొడ లేదా పాదంలో తిమ్మిరి లేదా జలదరింపు
  • నడవడంలో, కూర్చోవడంలో ఇబ్బంది
  • తుమ్ము పెట్టినప్పుడు లేదా వంగినప్పుడు నొప్పి తీవ్రమవడం
  • ఒక కాలు బలహీనంగా అనిపించడం

ఫిజియోథెరపీ చికిత్స (Physiotherapy Treatment for Sciatica)

1. McKenzie Method (మెకెంజీ పద్ధతి)

ఏ దిశలో కదిలినప్పుడు నొప్పి తగ్గుతుందో గుర్తించి, ఆ దిశలో వ్యాయామాలు చేయడం. చాలా డిస్క్ సంబంధిత సయాటిక కేసులలో వెన్ను వంచే (extension) వ్యాయామాలు ఉపకరిస్తాయి.

2. నరం వ్యాయామాలు (Neural Mobilization)

సయాటిక్ నరాన్ని మెల్లగా స్లైడ్ చేసే వ్యాయామాలు — నరం చుట్టూ ఉన్న జిగురు తగ్గిస్తాయి, నొప్పి తగ్గుతుంది.

3. లంబర్ ట్రాక్షన్ (Lumbar Traction)

మెకానికల్ ట్రాక్షన్ మెషిన్ ద్వారా వెన్నుపూసను మెల్లగా లాగడం — డిస్క్ ఒత్తిడి 40% వరకు తగ్గుతుంది.

4. కోర్ స్ట్రెంత్నింగ్ (Core Strengthening)

లోతైన వెన్నుపూస కండరాలను బలపర్చడం — మళ్లీ డిస్క్ జారిపోకుండా రక్షిస్తుంది.

5. ఎలక్ట్రోథెరపీ (Electrotherapy)

TENS మరియు IFT మెషిన్లు నొప్పిని అదుపు చేయడంలో సహాయపడతాయి, ముఖ్యంగా తీవ్రమైన దశలో.

నొప్పి తగ్గడానికి ఇంట్లో చేయగలిగేవి

  • పడుకునేటప్పుడు మోకాళ్ళ మధ్య దిండు పెట్టుకోండి
  • 45 నిమిషాలకు ఒకసారి లేచి మెల్లగా నడవండి
  • నొప్పి తగ్గే దిశలో మెల్లగా సాగు వ్యాయామాలు చేయండి
  • వేడి నీళ్ళ తాపడం (దీర్ఘకాలిక నొప్పికి) లేదా మంచు (తీవ్రమైన నొప్పికి) వాడండి